Friday, December 26, 2014

ఎడ్గర్ కేసీ – పరిచయం 2

భారతీయ కర్మసిద్ధాంతానికి ఎడ్గర్ కేసీ రీడింగ్స్ లోని విషయాలు దగ్గరగా ఉంటాయి. ఓ మనిషి బీదవాడుగానో లేదా ధనవంతుడిగానో, ఆరోగ్యవంతుడిగానో లేదా రోగగ్రస్తుడిగానో, కష్టాలతోనో లేక సుఖాలతోనో పుట్టడానికి కారణం కాకతాళీయం కాదు. ఆరోగ్యం లేదా అనారోగ్యం, కష్టసుఖాలు ఏవీ వంశపారపర్యముగా రావు. పూర్వజన్మలోని కర్మల ఫలితాలు ఇవి. ఇప్పుడు అనుభవిస్తున్నవి అన్నీ మనల్ని ప్రకృతి నుండి ఏదో నేర్చుకొమ్మని లభించినవే. ఏది నేర్చుకోవాలో అది నేర్చుకున్నప్పుడు ప్రస్తుతము ఉన్న స్థితి నుండి మరొక స్థితిని పొందడం జరుగుతుంది.
మొట్టమొదటిసారి భారతీయుల కర్మసిద్ధాంతమును ప్రాశ్చాత్య దేశములో వివరించి, సమర్ధించే ఋజువులు కేసీ రీడింగ్స్ లో లభిస్తాయి. కేసీ ఇచ్చిన వేల రీడింగ్స్ ని పరిశీలించిన మేధావులకు రెండు విషయాలు బోధపడ్డాయి. ఒకటి సైన్స్ కు ఆధ్యాత్మికతకు మధ్య ఎక్కువ వ్యత్యాసము లేదు అని. రెండవది మనిషి జీవితం ఆధ్యాత్మిక విస్తవిద్యాలయములో ఒక రోజు మాత్రమే అని. (హర్ దీన్ నయా జన్మ్ హర్ రాత్ నయీ మౌత్). పూర్వం ఋషులు చెప్పిన “పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితం” అన్నది కేసీ రీడింగ్స్ లో స్పష్టముగా కనిపిస్తుంది. పాపం కష్టం వేరువేరు కాదు అవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి అని కేసీ రీడింగ్స్ లో స్పష్టమవుతుంది. ఓ కర్మ తాలూకు ఫలితముగానే మళ్ళీ కర్మ అనుభవిస్తున్నాడు. అలా అనుభవించడం ద్వారా తాను ఒకనాడు చేసిన పని నుండి విముక్తి పొంది నైతికముగా ఎదుగుతున్నాడని కేసీ చెప్తాడు. మనం చేసే ప్రతిపని ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుందని తెలిసినప్పుడు పని చేసేటప్పుడు జాగురూకతో, నిబద్ధతతో ఉండటానికి ప్రయత్నిస్తాము. కర్మలలోని రకాలు cont …..            

Monday, December 1, 2014

ఎడ్గర్ కేసీ – పరిచయం

ఎడ్గర్ కేసీ అమెరికాలో 1877 లో జన్మించాడు. చిన్నప్పుడే చర్చ్ లో ప్రీస్ట్ కావాలనుకున్నాడు కానీ సాధ్యపడలేదు. 21వ ఏట ఆయన కంఠపేటిక దెబ్బతిని మాట పడిపోయింది. మాటపోయిన కారణముగా రకరకాల ఉద్యోగాలు చేస్తూ చివరికి ఫోటోగ్రఫీ వృత్తిలో అప్రెంటిస్ గా చేరాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ హిప్నాటిజం చేసే హర్ట్ (Hart) అనే వ్యక్తి కేసీకి మధ్యలోపోయిన మాటను గురించి తెలుసుకున్నాడు.  హిప్నోసిస్ (Hypnosis) ద్వారా కేసీకి చికిత్స చేసి అతనికి మాట తెప్పించాలనుకున్నాడు. అందుకు కేసీ సంతోషముగా ఒప్పుకున్నాడు. అయితే అది కొంతవరకు మాత్రమే సఫలము అయింది. కేసీ ట్రాన్స్ లో ఉన్నప్పుడు హర్ట్ సూచనల ప్రకారం మాట్లాడగలిగే వాడు, కానీ హిప్నోసిస్ ట్రాన్స్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత యధాస్థితి కొనసాగేది. హిప్నోసిస్ ట్రాన్స్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత (post hypnotic suggestion) కూడా మాట్లాడమని హర్ట్ చేసిన సూచన ఫలించలేదు. ఇతర ప్రదేశాలలో కార్యక్రమాలు ఉండటంతో హర్ట్ కేసీ ఉండే ప్రాతాన్ని వదలవలసి వచ్చింది.
అదే ఊరిలో ఉండే లేనీ (Layne) అనే ఔత్సాహిక హిప్నాటిస్ట్ కేసీకి జరిగే చికిత్సా విధానాన్ని ఆసక్తిగా follow అవుతూ ఉండేవాడు. హర్ట్ వేరే ప్రదేశానికి వెళ్ళడం వలన కేసీపై తను పరిశోధన చేయదలచుకున్నానని తనని కూడా హిప్నోథెరపీ చెయ్యనివ్వమని కేసీని అడిగాడు. ఎలాగైనా తన కంఠస్వరమును తిరిగి తెచ్చుకోవాలని ఆతృతతో ఉన్న కేసీ అందుకు ఒప్పుకున్నాడు. కేసీని హిప్నోటైజ్ చేసిన లేనీ అతనినే (కేసీనే) చికిత్సా విధానాన్ని సూచించమని కోరాడు. ఆశ్చర్యకరంగా ట్రాన్స్ లో ఉన్న కేసీ తన తన కంఠంలోని vocal cards పరిస్థితిని వివరించాడు. “స్వరపేటికలోని కండరాలకి పాక్షికముగా పక్షవాతము వచ్చింది. హిప్నాటిక్ ట్రాన్స్ లో ఉండగానే ఆ నరాలలోకి రక్తప్రసరణ అధికమయ్యేలాగా సూచన చేయడం ద్వారా ఆ పరిస్థితిని అధిగమించవచ్చు“ అని చెప్పాడు. లేనీ వెంటనే కేసీని కంఠనాళాలలోకి రక్తప్రసరణ అధికం చెయ్యమని అందువల్ల అతనిలోని వ్యాధి తగ్గిపోతుందని సూచించాడు. కొంతసేపు తర్వాత హిప్నోటిక్ నిద్రలో ఉన్న కేసీ గొంతు సవరించుకొని చెప్పాడు “ఇప్పుడు రోగి పరిస్థితి బాగైనది. మళ్ళీ రక్తప్రసరణ మామూలుగా అయ్యే సూచన, హిప్నోటిక్ ట్రాన్స్ లో నుండి బయటకు వచ్చే సూచన ఇవ్వు” అని చెప్పాడు. చిత్రముగా కేసీ మాట తిరిగి వచ్చింది. ఎప్పుడైనా తిరిగి ఈ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఈ హిప్నోథెరపీ ద్వారా సమస్య మాయమవసాగింది.
చికిత్సా విధానము అక్కడితో పూర్తి కాలేదు. హిప్నోసిస్ స్థితిలో తన రోగకారణమును తానే కనుక్కున్నప్పుడు ఇతరుల రోగములకు కారణము ఎందుకు కనుక్కోలేము అని ఆలోచించసాగాడు. లేనీ మొదట పరిశోధన తనమీద తానే చేసుకోవాలని అనుకున్నాడు. చాలాకాలముగా లేనీకి కడుపులో నొప్పిగా ఉండేది. కేసీ హిప్నోసిస్ స్థితిలో ఉండగా లేనీ తన కడుపులోని పరిస్థితిని వివరించి చికిత్సా విధానాన్ని సూచించమని అడిగాడు. కేసీ చికిత్సా విధానాన్ని సూచించాడు. ఎన్నో సంవత్సరాల తరబడి తగ్గని నొప్పి కొన్ని వారాలలోనే పూర్తిగా మాయమైపోయింది. కొత్త చికిత్సా విధానము దొరికిందని లేనీ సంబరపడ్డా కేసీ దాని మీద ఎలాంటి ఆసక్తి కనబరచలేదు. కానీ అనారోగ్యముతో బాధపడే వారికి మాత్రము సహాయం చేయాలని కేసీకి బలంగా ఉండేది. ప్రతి సంవత్సరం బైబిల్ ను మొదటి నుండి చివర వరకు చదివే అలవాటు ఉన్న కేసీ క్రీస్తు రాగగ్రస్థుల రోగాలను తీసివేసినట్లు చదివి తను కూడా అలాంటి శక్తి కలిగి ఉండాలని కోరుకునేవాడు.

నెమ్మదినెమ్మదిగా లేనీ కేసీ కలసి రోగగ్రస్తులకు సహాయం చెయ్యడం ప్రారంభించారు. హిప్నోసిస్ లోకి వెళ్ళి కేసీ రోగగ్రస్థుడి పరిస్థితి, కారణము, చికిత్సావిధానాన్ని వివరిస్తుంటే, లేనీ దానిని షార్ట్ హ్యాండ్ లో త్వరత్వరగా రాసుకునేవాడు. దానిని మరలా లాంగ్ హ్యాండ్ లో వ్రాసి రోగికి ఒక కాపీ ఇచ్చి తమ దగ్గర ఒక కాపీ ఉంచుకునేవారు. మనిషిని చూడకుండా పేరు వివరాలు చెప్తే కూడా వారి గురించి చెప్పేవాడు. అలా చికిత్స చేసిన వానిలో కొన్నింటిని తీసుకొని జినా సర్మిసారా (Gina Cerminara) అనే ఆమె 1950 లో “మెనీ మాన్షన్స్” అనే పుస్తకము వ్రాసింది. 

ఎడ్గర్ కేసీ సమ్మోహన స్థితిలో ఉన్నప్పుడు వ్యాధిగ్రస్థుల ఈ జన్మలో వాళ్ళకు సంబంధించిన విషాయలు తెలుసుకొని పూర్వజన్మలలో ఎప్పుడు ఏ ఏ కర్మల ద్వారా పునాదులు పడ్డాయో, వారి జీవితములలోని సంఘటనలు, గుణగణములను గురించి కూడా చెప్పేవాడు. మొదట మొదట తన కుటుంబసభ్యులు, స్నేహితులకు, తెలిసినవాళ్ళకు చెప్పేవాడు. వాళ్ళ గురించి తనకు తెలిసినది తన సబ్ కాంషన్స్ మైండ్ లో నిక్షిప్తమై ఇప్పుడు బయటకు వస్తోంది అని అనుకునేవాడు. కానీ తను ఎప్పుడు చూడని దూరప్రాంతాలలోని వారి విషయాలు కూడా నిజం అవుతూ ఉండటంతో కేసీ చాలాకాలం అయోమయంతో గడిపేవాడు. దీనికి కారణం జన్మతః క్రైస్తవుడైన కేసీ బైబిల్ ను క్షుణ్ణముగా చదివేవాడు. బైబిల్ లో ఎక్కడా పునర్జన్మ ప్రసక్తి లేదు. దానితో కేసీ తాను చెప్పేది నిజం కాదేమో అనే అయోమయంలో ఉండేవాడు. కానీ అతను చెప్పినవి నిజం అవుతూ ఉండటంతో పునర్జన్మను నమ్మక తప్పలేదు.

కేసీకి వేరొకవ్యక్తి గురించి తనకు ఎలా తెలుస్తోంది అని ఆలోచించినప్పుడు కేసీ ఏ మనిషి గురించి చెప్తున్నాడో ఆ మనిషి యొక్క సబ్ కాంషస్ మైండ్ కేసీ యొక్క సబ్ కాంషస్ మైండ్ లో సంబంధం ఏర్పడటం మూలంగా సమాచారం అందుతోందనే నిర్ధారణకి వచ్చాడు.
వివరాలు cont ….