Friday, December 26, 2014

ఎడ్గర్ కేసీ – పరిచయం 2

భారతీయ కర్మసిద్ధాంతానికి ఎడ్గర్ కేసీ రీడింగ్స్ లోని విషయాలు దగ్గరగా ఉంటాయి. ఓ మనిషి బీదవాడుగానో లేదా ధనవంతుడిగానో, ఆరోగ్యవంతుడిగానో లేదా రోగగ్రస్తుడిగానో, కష్టాలతోనో లేక సుఖాలతోనో పుట్టడానికి కారణం కాకతాళీయం కాదు. ఆరోగ్యం లేదా అనారోగ్యం, కష్టసుఖాలు ఏవీ వంశపారపర్యముగా రావు. పూర్వజన్మలోని కర్మల ఫలితాలు ఇవి. ఇప్పుడు అనుభవిస్తున్నవి అన్నీ మనల్ని ప్రకృతి నుండి ఏదో నేర్చుకొమ్మని లభించినవే. ఏది నేర్చుకోవాలో అది నేర్చుకున్నప్పుడు ప్రస్తుతము ఉన్న స్థితి నుండి మరొక స్థితిని పొందడం జరుగుతుంది.
మొట్టమొదటిసారి భారతీయుల కర్మసిద్ధాంతమును ప్రాశ్చాత్య దేశములో వివరించి, సమర్ధించే ఋజువులు కేసీ రీడింగ్స్ లో లభిస్తాయి. కేసీ ఇచ్చిన వేల రీడింగ్స్ ని పరిశీలించిన మేధావులకు రెండు విషయాలు బోధపడ్డాయి. ఒకటి సైన్స్ కు ఆధ్యాత్మికతకు మధ్య ఎక్కువ వ్యత్యాసము లేదు అని. రెండవది మనిషి జీవితం ఆధ్యాత్మిక విస్తవిద్యాలయములో ఒక రోజు మాత్రమే అని. (హర్ దీన్ నయా జన్మ్ హర్ రాత్ నయీ మౌత్). పూర్వం ఋషులు చెప్పిన “పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితం” అన్నది కేసీ రీడింగ్స్ లో స్పష్టముగా కనిపిస్తుంది. పాపం కష్టం వేరువేరు కాదు అవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి అని కేసీ రీడింగ్స్ లో స్పష్టమవుతుంది. ఓ కర్మ తాలూకు ఫలితముగానే మళ్ళీ కర్మ అనుభవిస్తున్నాడు. అలా అనుభవించడం ద్వారా తాను ఒకనాడు చేసిన పని నుండి విముక్తి పొంది నైతికముగా ఎదుగుతున్నాడని కేసీ చెప్తాడు. మనం చేసే ప్రతిపని ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుందని తెలిసినప్పుడు పని చేసేటప్పుడు జాగురూకతో, నిబద్ధతతో ఉండటానికి ప్రయత్నిస్తాము. కర్మలలోని రకాలు cont …..            

No comments:

Post a Comment